Modi And Jagan Fights For Prashant Kishor | Oneidia Telugu

2018-02-26 1

Prime Minister Narendra Modi’s 2019 re-election bid may see the return of election strategist Prashant Kishor to his side.

2019 ఎన్నికల్లో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం పావులు కదుపుతున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇదే ఎన్నికల్లో బీజేపీ, నరేంద్ర మోడీ కోసం పని చేయనున్నారా? అంటే కావొచ్చునని అంటున్నారు. నరేంద్ర మోడీ, ప్రశాంత్ కిషోర్‌ల మధ్య ఇటీవల భేటీ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ప్రశాంత్ కిషోర్ పని చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జగన్ కోసం పని చేస్తున్నారు.
అయితే, ఊహించని విధంగా ప్రశాంత్ కిషోర్ (పీకే), మోడీ చర్చలు జరిగాయని వస్తున్న వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి. పీకే మరోసారి తన సేవల్ని బీజేపీకి అందించే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. 2014 బీజేపీ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన తర్వాత అమిత్ షాతో వచ్చిన విభేదాలతో పీకే ఆ పార్టీకి దూరం జరిగారు.
ఆ తర్వాత పీకే బీహార్‌లో నితీష్ కుమార్‌ కోసం పని చేశారు. అక్కడ విజయాన్ని అందించారు. ప్రశాంత్ కిషోర్ సక్సెస్ రేటు చూసి కాంగ్రెస్ పార్టీ యూపీ ఎన్నికల్లో ఆయన సేవలు వినియోగించుకుంది. కానీ, బీజేపీ ప్రభ ముందు బొక్క బోర్లా పడింది. ఆయన ఇప్పుడు వైసీపీకి వచ్చే ఎన్నికల్లో సేవలు అందించేందుకు ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారు.
అయితే, పీకే సేవలను మరోసారి ఉపయోగించుకోవాలని మోడీ కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రధాని, ప్రశాంత్ కిషోర్ మధ్య పలు మార్లు భేటీ కూడా జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి.